పక్కింట్లో పేలిన సిలిండర్.. ఈ ఇంట్లో ఆగిన గుండె!
Add ap7am to your home Screen

పక్కింట్లో పేలిన సిలిండర్.. ఈ ఇంట్లో ఆగిన గుండె!

Hyderabad Jalamandali GM died
  • సిలిండర్ పేలిన శబ్దానికి గుండెపోటు
  • అక్కడికక్కడే మృతి చెందిన జలమండలి జీఎం 
  • నివాళులర్పించిన మంత్రి తలసాని, ఎమ్మెల్యే గోపీనాథ్
ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. మరో ఇంట్లో ప్రాణాలు తీసింది. హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో జరిగిందీ ఘటన. రెడ్‌హిల్స్ డివిజన్ జలమండలి జీఎం ఆర్.శ్రీనివాసరావు (51).. పక్కింట్లో పేలిన గ్యాస్ సిలిండర్ శబ్దానికి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.

ఆయన పక్క ఇంట్లో సిలిండర్ పేలడంతో ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. మంటలు చెలరేగే ప్రమాదం పెద్దది కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో కరెంటు స్విచ్‌లు ఆఫ్ చేసేందుకు కిందికి వచ్చారు. అదే సమయంలో మరో సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు.

 ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ శేషుకుమారి, జలమండలి జీఎం ప్రభు, సహచర ఉద్యోగులు ఆయన ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.
Telangana
Talasani
Heart attack
jalamandali

More Telugu News