కరోనాపై పోరాటానికి సత్య నాదెళ్ల అర్ధాంగి భారీ విరాళం
Add ap7am to your home Screen

కరోనాపై పోరాటానికి సత్య నాదెళ్ల అర్ధాంగి భారీ విరాళం

Microsoft CEO Satya Nadella wife Anupama donates to anti corona battle
  • ప్రపంచదేశాల్లో కరోనా బీభత్సం
  • వైరస్ నివారణపై తీవ్ర పోరాటం సాగిస్తున్న ప్రభుత్వాలు
  • తెలంగాణ ప్రభుత్వానికి రూ.2 కోట్ల విరాళం అందించిన అనుపమ
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కరోనా వైరస్ భూతం హడలెత్తిస్తోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ మహమ్మారితో అలుపెరుగని పోరాటం సాగిస్తున్నాయి. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేనందున నివారణే అత్యుత్తమ చికిత్స అని అందరి అభిప్రాయం. ఈ క్రమంలో కరోనాపై పోరాటానికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అర్ధాంగి అనుపమ భారీ విరాళంతో ముందుకొచ్చారు. కరోనా నివారణకు అనుపమ రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని అనుపమ తండ్రి తెలంగాణ సీఎం సహాయనిధికి అందించారు.
Anupama
Corona Virus
Donation
Microsoft
Satya Nadella
Telangana

More Telugu News