Trivikram Srinivas: మళ్లీ తమన్ కి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ తన తదుపరి సినిమా పనులకి సంబంధించిన పనులతో బిజీగా వున్నాడు. ఆయన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ఉండనుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ను తీసుకున్నారట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాకి తమన్ స్వరాలను సమకూర్చాడు. ఆ పాటలన్నీ కూడా చాలా పాప్యులర్ అయ్యాయి. సినిమా విజయంలో తమన్ సంగీతం ప్రధానమైన పాత్రను పోషించింది.

ఇక ఇంతకుముందే త్రివిక్రమ్ చేసిన 'అరవింద సమేత' సినిమాకి, ఎన్టీఆర్ చేసిన 'బృందావనం' సినిమాకి తమన్ పనిచేసి వున్నాడు. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ చేయనున్న సినిమా కూడా తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకోవడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశం వుంది.  
Trivikram Srinivas
Junior NTR
Thaman

More Telugu News