జగన్ .. జడ్జిలకు కూడా ‘కులం’ ఆపాదిస్తాడేమోనని భయంగా ఉంది: అచ్చెన్నాయుడు సెటైర్లు

TDP leader Atchanaidu satires on Jagan
  • సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని జగన్ ఆపాదించారు
  • ఇప్పుడు ఎవరికి ఆపాదిస్తారు?
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో సీఎం జగన్ పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఇప్పుడు జడ్జిలకు కూడా ‘కులం’ ఆపాదిస్తాడేమోనని భయంగా ఉందంటూ సెటైర్లు విసిరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించిన జగన్ ఇప్పుడు ఎవరికి ఆపాదిస్తారు? ఎన్నికల కోడ్ ను సడలించడాన్ని కూడా స్వాగతిస్తున్నామని, కొత్త పథకాలు వద్దని సుప్రీంకోర్టే చెప్పిందని, దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉండే ఆంధ్రులు విమానాశ్రయాల్లో విలపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదని విమర్శించారు.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Jagan
YSRCP
Local Body Polls
Supreme Court

More Telugu News