Nara Lokesh: 'చంద్రకాలం.. రాహుకాలం' అంటూ కార్టూన్‌ పోస్ట్ చేసిన లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
'చంద్రకాలం.. రాహుకాలం' అంటూ కార్టూన్‌ పోస్ట్ చేసిన టీడీపీ నేత లోకేశ్.. ఏపీ సీఎం జగన్‌ పాలనలో పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. 'బాబు గారు ఉంటేనే జాబు అని స్వయంగా సీఎం జగన్ గారే ప్రకటించారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుంది' అని చెప్పారు.                                       'ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయ్యింది. 10 నెలల తుగ్లక్ పాలనలో నిరుద్యోగులను నిలువునా ముంచారు. ఉన్న కంపెనీలను తరిమేశారు. వస్తా అన్న కంపెనీలను వద్దన్నారు. ఆఖరికి ఉన్న నిరుద్యోగ భృతి కూడా ఎత్తేసి ఆకలేసి కేకలేసే పరిస్థితి తెచ్చారు' అని విమర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News