మీటూ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కైరా అద్వానీ
- మీటూ వల్ల పూర్తి ఫలితం రాలేదు
- పరిస్థితులు మారుతాయని కూడా నేను అనుకోవడం లేదు
- మీటూ తర్వాతి దశకు మనం చేరుకోలేకపోయాం
అయితే హీరోయిన్ బాలీవుడ్ భామ కైరా అద్వానీ మాత్రం మీటూ వల్ల పూర్తి ఫలితం రాలేదని వ్యాఖ్యానించింది. మీటూ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారుతాయని తాను భావించానని... అయితే ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. మార్పులు వస్తాయని కూడా తాను భావించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. మీటూ తర్వాతి దశకు మనం చేరుకోలేకపోయామని చెప్పింది. కైరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.