2017లో విజయ్ దేవరకొండపై తెలంగాణ ప్రభుత్వం చిత్రీకరించిన హోలీ సాంగ్... ఇప్పుడు వైరల్!
Add ap7am to your home Screen

2017లో విజయ్ దేవరకొండపై తెలంగాణ ప్రభుత్వం చిత్రీకరించిన హోలీ సాంగ్... ఇప్పుడు వైరల్!

Holi Song on Vijay Devarakonda Viral Again
  • దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి
  • సందర్భం రావడంతో మళ్లీ వైరల్
  • మత సామరస్యాన్ని చాటేలా వీడియో సాంగ్
అది 2017. ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సభల కోసం కొన్ని పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించింది. వీటిల్లో ఓ పాటను వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, విజయ్ దేవరకొండ నటించాడు. హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ సాగే పాట, ఈ హోలీ సందర్భంగా మరోసారి వైరల్ అయింది. ఈ దాదాపు రెండున్నరేళ్ల క్రితం చిత్రీకరించినదే అయినా, సందర్భం రావడంతో, అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ మరోసారి చూడవచ్చు.
Viral Videos
Vijay Devarakonda
Telangana
Holi Song

More Telugu News