తొలి ఓవర్లోనే క్యాచ్ డ్రాప్.. భారీ షాట్లతో చెలరేగుతున్న ఆసీస్ ఓపెనర్
- 11 ఓవర్లలోనే వంద దాటిన స్కోరు
- భారత్‌తో ఫైనల్లో భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా
- నిరాశ పరుస్తున్న టీమిండియా బౌలర్లు
ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్న హీలీ వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదేస్తోంది. 30 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుంది. శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లతో విజృంభించింది. మరో ఓపెనర్ బెత్ మూనీ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. భారత బౌలర్లు నిరాశ పరుస్తుండడంతో ఆసీస్ 200 రన్స్ చేసేలా కనిపిస్తోంది.