ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి జగన్ చావు దెబ్బ కొట్టారు: నారా లోకేశ్

27-02-2020 Thu 11:17 | Andhra
  • 9 నెలల నుండి వైకాపా పరివారం "గో బ్యాక్" అంటూనే ఉన్నారు
  • రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి
  • విశాఖ ప్రమాదకరమైన ప్రాంతమని  కమిటీతో రిపోర్ట్ రాయించారు
  • ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను "గో బ్యాక్" అని తరిమేశారు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఉత్తరాంధ్ర పర్యటనకు వైసీపీ ఆటంకాలు కలిగిస్తోన్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. '9 నెలల నుండి తుగ్లక్ సమేత వైకాపా పరివారం "గో బ్యాక్" అంటూనే ఉన్నారు. అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమకి రావాల్సిన కంపెనీలు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. విశాఖ ప్రమాదకరమైన ప్రాంతం అంటూ జీఎన్ రావ్ కమిటీతో రిపోర్ట్ రాయించి ఉత్తరాంధ్ర యువతకి రావాల్సిన ఉద్యోగాలను "గో బ్యాక్" అని తరిమేశారు' అని విమర్శించారు.
 
'హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి  ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం జగన్ గారు ఇచ్చాను అంటున్న రూ.50 లక్షలు పోనాయి ఏటి సేత్తాం?' అని నిలదీశారు.

'దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన జగన్ గారిని "గో బ్యాక్" అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది' అని విమర్శించారు.
Nara LokeshTelugudesamYSRCPAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more