ట్రంప్‌ దంపతులతో కలసి తాజ్‌మహల్‌ సందర్శనకు మోదీ వెళ్లరట!
Add ap7am to your home Screen

ట్రంప్‌ దంపతులతో కలసి తాజ్‌మహల్‌ సందర్శనకు మోదీ వెళ్లరట!

Modi will not accompany the US President Donald Trump during his visit to Taj
  • ఈ నెల 24న భారత పర్యటనకు ట్రంప్
  • అదే రోజు తాజ్‌మహల్‌ వద్దకు
  • వారితో పాటు మోదీ కూడా ఉంటారని వార్తలు
  • కొట్టి పారేసిన అధికారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24న భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అదే రోజు తన భార్య మెలానియాతో ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఆ సమయంలో వారితో పాటు ప్రధాని మోదీ కూడా తాజ్‌ మహల్‌ను సందర్శిస్తారని వార్తలు వస్తున్నాయి.

దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ ఆ వార్తలను కొట్టేశారు. ఆ సమయంలో వారితో మోదీ ఉండబోరని స్పష్టం చేశారు. 'తాజ్‌మహల్‌ను ట్రంప్ సందర్శిస్తోన్న సమయంలో ఆయనతో పాటు మోదీ కూడా ఉంటారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారితో కలిసి భారత్ నుంచి ఏ ప్రముఖ వ్యక్తీ తాజ్‌మహల్‌ను సందర్శించరు' అని చెప్పారు.
Narendra Modi
BJP
Donald Trump
tajmahal

More Telugu News