అలనాటి కన్నడ నటి లీలావతి తోటలో అగ్ని ప్రమాదం.. విచారణ జరిపించాలన్న వర్ధమాన నటుడు వినోద్
- దెబ్బ తిన్న టేకు, ఇతర వ్యవసాయోత్పత్తులు
- ఏడాది కాలంలో జరిగిన మూడో ఘటన
- పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదన్న లీలావతి
కాగా, ఏడాది కాలంలో జరిగిన మూడో ప్రమాదం ఇదని లీలావతి తెలిపారు. నెలమంగల తాలూకాలోని సోలదేవనహల్లిలో ఉన్న ఈ తోటకు సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లీలావతి కుమారుడు, వర్ధమాన నటుడు వినోద్ ఆరోపించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. కొందరు వ్యక్తులు పలు రకాల సమస్యలను సృష్టించి తమను వేధిస్తున్నారంటూ లీలావతి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. అంతలోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.