సీఏఏ, ఎన్నార్సీ విషయంలో ఆందోళన చెందొద్దు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
- సీఏఏకు మద్దతు తెలిపినప్పుడు ఎన్పీఆర్, ఎన్నార్సీ లేవు
- తమ వైఖరి ఏమిటో అప్పట్లోనే స్పష్టం చేశాం
- ముస్లింలకు వైసీపీ అండగా ఉంటుంది
ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... వారికి వైసీపీ అండగా ఉంటుందని సజ్జల భరోసా ఇచ్చారు. సీఏఏ, ఎన్నార్సీల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని... వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పారు.