మనోజ్ కి 'అహం బ్రహ్మాస్మి' టైటిల్ ను ఇచ్చిన క్రిష్

Krish gives title to Manoj
షార్ట్స్‌లో చూడండి
మంచు మనోజ్ తాజాగా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, ఆ బ్యానర్ పై తొలి సినిమాగా 'అహం బ్రహ్మాస్మి'ని ప్రకటించాడు. కాస్త ఆలస్యమైనా మనోజ్ మంచి పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేశాడని చాలామంది అనుకున్నారు. నిజానికి ఈ టైటిల్ దర్శకుడు క్రిష్ దగ్గర వుంది. చాలా కాలం క్రితమే క్రిష్ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు.

రానా - అల్లు అర్జున్ కాంబినేషన్లో ఆయన ఈ టైటిల్ పై సినిమా చేయనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ క్రిష్ మాత్రం ఆ టైటిల్ ను అలా అట్టిపెట్టాడు. మనోజ్ తన దగ్గరికి వచ్చిన కథకి ఈ టైటిల్ బాగుటుందని భావించి, క్రిష్ ను రిక్వెస్ట్ చేశాడట. 'వేదం' సినిమా నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన మనోజ్ అడగ్గానే క్రిష్ ఇచ్చేశాడట. అలా మనోజ్ కి ఒక మంచి టైటిల్ దొరికేసింది. ప్రస్తుతం పవన్ తో ఒక సినిమా చేయడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Krish
Manchu Manoj
Aham Brahmasmi Movie
Pavan

More Telugu News