‘పోలవరం’ పనులు ఆగిపోయాయన్నది ‘ఎల్లో మీడియా’ దుష్ప్రచారం: మంత్రి అనిల్ కుమార్
- చంద్రబాబు గురించి గొప్పగా రాసుకుంటే రాసుకోండి
- ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయొద్దు
- ప్రతిపక్షంలో ఉండీ అధికారులను బెదిరిస్తున్నారు
'నాలుగున్నరేళ్ల తర్వాత టీడీపీ ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియదు కానీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి, అధికారుల అంతు చూస్తుందట' అంటూ సెటైర్లు విసిరారు. గత ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయి రక్తం గడ్డ కట్టినట్టుందని, ఒకసారి స్కాన్ చేయిస్తే మంచిదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారులకు ఈ విధంగా వార్నింగ్ ఇస్తున్న టీడీపీ నేతలు, అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా వ్యవహరించి ఉంటారు? అని అనిల్ ప్రశ్నించారు.