ఆసీస్ క్రికెట్ యూనిఫాంలో సచిన్... బ్యాట్ పట్టి మైదానంలో దిగిన మాస్టర్!
- ఆస్ట్రేలియాలో కార్చిచ్చు విలయం
- బాధితుల కోసం ఛారిటీ మ్యాచ్ లు
- మెల్బోర్న్ మైదానంలో సచిన్ సందడి
ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ బ్రేక్ వచ్చినప్పుడు సచిన్ బ్యాట్ పట్టి మైదానంలో దిగి తన బ్యాటింగ్ తో అలరించాడు. ఆసీస్ ట్రేడ్ మార్క్ యూనిఫాం ఎల్లో డ్రస్ లో వచ్చిన సచిన్ మహిళా బౌలర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ లో తన కళాత్మక బ్యాటింగ్ ను ప్రదర్శించాడు. తాను ఫామ్ లో ఉన్న రోజుల్లో ఎంత సులువుగా బంతిని టైమింగ్ చేసేవాడో ఇప్పుడూ అంతే ఈజీగా బంతిని బ్యాట్ కు తాకిస్తూ తన క్లాస్ ను చాటాడు.