నల్లమల అడవిలో మహారాష్ట్ర మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు!
- అక్కమహాదేవి గుహల సమీపంలో మహిళ దారుణ హత్య
- అత్యాచారం చేసి హత్య చేసిన సాధువు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళ మృతదేహం పక్కనే పడివున్న ఆధార్‌కార్డును బట్టి ఆమె మహారాష్ట్రలోని థానే వాసిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిరుపతి వెళ్తున్నట్టు చెప్పి జనవరి 25న ఆమె ఇంటి నుంచి వెళ్లినట్టు వారు చెప్పారు. దీంతో ఆమె మొబైల్ నంబరు సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడెక్కడికి వెళ్లిందో ఆరా తీశారు. అలాగే, సీసీటీవీ ఫుటేజీలనూ పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. తమిళనాడుకు చెందిన రామకృష్ణ అలియాస్ మట్టస్వామి అనే సాధువుతో కలిసి వెళ్లినట్లు గుర్తించి నిన్న అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు వాంగ్మూలమిచ్చాడని పోలీసులు తెలిపారు.