ఏపీ రాజధానికి పరిష్కారం కోర్టులో లభించవచ్చు: జీవీఎల్
- ఏపీ రాజధాని అంశంలో జీవీఎల్ వ్యాఖ్యలు
- ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదన్న జీవీఎల్
- రాజధాని అమరావతేనని రాజకీయ తీర్మానం చేశామని వెల్లడి
అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాబట్టి, రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పిందని వివరించారు. ఈ వైఖరిని ప్రతిఘటించాలనుకుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.