అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ దర్శకుల సందడి
- అల.. వైకుంఠపురములో చిత్రం ఘనవిజయం
- తన నివాసంలో పార్టీ ఇచ్చిన బన్నీ
- రాఘవేంద్రరావు సహా దర్శకులందరికీ ఆహ్వానం
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి, తమ టాలెంట్ నిరూపించుకుంటున్న యువదర్శకుల వరకు బన్నీ ఇంట్లో అందరూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను బన్నీనే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. "మా సంబరాల్లో పాలుపంచుకునేందుకు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం మాకు ఎల్లప్పటికీ ప్రత్యేకం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు.