2024లో బీజేపీ-జనసేన ఘన విజయం సాధించబోతోంది: నాదెండ్ల మనోహర్

  • మా పొత్తులో ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తాం
  • జనసేనను విలీనం చేస్తారన్నది దుష్ప్రచారం
  • వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టు కాదు
ఏపీలో 2024లో బీజేపీ-జనసేన పొత్తు ఘన విజయం సాధించబోతోందని ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో తమ పొత్తులో ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేస్తామని చెప్పారు. బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా? అని ప్రశ్నించగా, రాజకీయాల్లో ఇలాంటి దుష్ప్రచారం మామూలేనని బదులిచ్చారు.

చాలా నిజాయతీగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, యువతకు స్ఫూర్తి నిచ్చే విధంగా పని చేద్దామని, పాతికేళ్ల భవిష్యత్ గురించి ఆలోచిద్దామన్న నిర్ణయాలు పవన్ తీసుకున్నారని చెప్పారు. ఒక మార్గానికి కట్టుబడి కమిట్ మెంట్ తో ముందుకు వెళ్తున్నప్పుడు కావాలని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్టు కాదని నాదెండ్ల హితవు పలికారు.
Go Back to Shorts
Nadendla Manohar
Janasena
Pawan Kalyan
BJP

More Telugu News