కివీస్ తో టెస్ట్ సిరీస్ కు హార్దిక్ దూరం!
- వెన్నుగాయం నుంచి కోలుకోని హార్దిక్ పాండ్యా
- మరింత విశ్రాంతిని సూచించిన వైద్యులు
- ఫిట్ నెస్ సాధించేవరకు ఎన్ సీఏ శిబిరంలోనే
‘హార్దిక్ శస్త్ర చికిత్స తర్వాత, ఎన్ సీఏ ఫిజియో ఆశిష్ కౌశిక్ తో కలిసి మెడికల్ రివ్యూ కోసం లండన్ వెళ్లాడు. హార్దిక్ మ్యాచ్ లు ఆడటం ఇప్పుడే కుదరదని.. ఇంకా సమయం పడుతుందని డాక్టర్ జేమ్స్ అల్లీబోన్ తెలిపారు. హార్దిక్ పూర్తి ఫిట్ నెస్ సాధించేవరకు ఎన్ సీఏ లో ఆటగాళ్ల పునరావాస శిబిరంలోనే ఉంటాడు’ అని బీసీసీఐ తెలిపింది. హార్డిక్ పాండ్యా చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆడిన విషయం తెలిసిందే.