అర్ధరాత్రి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కార్యాలయాలు కర్నూలుకు తరలింపు!
- విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాల తరలింపు
- అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- భవనాలు చూడాలంటూ కర్నూలు కలెక్టర్కు ఆదేశాలు
ప్రస్తుతం ఈ కార్యాలయాలు వెలగపూడి సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్నాయి. పరిపాలన పరమైన కారణాల వల్ల వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం.. వాటికి అవసరమైన భవనాలను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఇన్ చీఫ్, కర్నూలు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
