అందరి ప్రశ్న ఒక్కటే... జగన్ అప్పుడలా, ఇప్పుడిలా ఎందుకు అన్నారు?: నారా లోకేశ్

  • లోకేశ్ వరుస ట్వీట్లు
  • జగన్ మూడు ముక్కలాట మొదలుపెట్టారంటూ విమర్శ
  • ఓ మహిళ సంధించిన ప్రశ్నాస్త్రాలను వీడియోల రూపంలో ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ట్విట్టర్ లో స్పందించారు. అందరిలోనూ ఒకటే ప్రశ్న ఉదయిస్తోందని తెలిపారు. ఎన్నికల ముందు వరకు జై అమరావతి అన్న వైఎస్ జగన్ ఇప్పుడు మూడు ముక్కలాట ఎందుకు మొదలుపెట్టారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సామాన్యులు సంధించిన పలు ప్రశ్నాస్త్రాలను వీడియో రూపంలో వరుస ట్వీట్లు చేశారు. అమరావతి రాజధానిగా పనికిరాదని ఇప్పుడు చెబుతున్న జగన్, నాడు అసెంబ్లీలో ఏంచెప్పారని ఓ మహిళ వీడియోలో ప్రశ్నించింది. రాజధాని కోసం ఉద్యమిస్తున్న వాళ్లను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న పృథ్వీ ఇప్పుడెక్కడున్నాడో తెలియదని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Amaravati
AP Capital
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News