హామిల్టన్ లో అసలైన మజా.... సూపర్ ఓవర్ లో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన రోహిత్
- మూడో టి20లో స్కోర్లు సమం
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్... స్కోరు 179/5
- చేజింగ్ లో సరిగ్గా 179 పరుగులు చేసిన కివీస్
- సూపర్ ఓవర్ కు దారితీసిన మ్యాచ్
కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. ఆపై 18 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీ పోరాటపటిమ చూపించడం మ్యాచ్ భారత్ వశమైంది. రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.