'కరోనా'పై భయం వద్దు... స్వైన్ ఫ్లూ తరహాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల

  • చైనాలో కరోనా వైరస్ బీభత్సం
  • ప్రపంచ దేశాల్లో అప్రమత్తత
  • తాము సన్నద్ధంగానే ఉన్నామన్న తెలంగాణ మంత్రి ఈటల
చైనాలో కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అనేక దేశాలకు కలవరం కలిగిస్తోంది. భారత్ లోనూ ఈ ప్రాణాంతక వైరస్ పై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయడం ఆపేయాలని స్పష్టం చేశారు.

 గతంలో స్వైన్ ఫ్లూ విషయంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఇప్పుడు కరోనా వైరస్ విషయంలోనూ అప్రమత్తంగానే ఉన్నామని వెల్లడించారు. అసత్య ప్రచారాలతో ప్రజలు భయపడొద్దని సూచించారు. ఆయన తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటిండెంట్ శంకర్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి కరోనా వైరస్ అంశంపై సమీక్ష జరిపారు.
Go Back to Shorts
CoronaVirus
Etela Rajender
Telangana
TRS
China

More Telugu News