ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ కు థ్యాంక్స్ చెప్పిన రజనీకాంత్
- 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో రజనీ
- కర్ణాటకలోని బండిపుర అడవుల్లో బేర్ గ్రిల్స్ తో సాహసాలు
- త్వరలోనే డిస్కవరీ చానల్లో ప్రసారం
అయితే, ఇదో మరుపురాని అనుభవం అని రజనీకాంత్ ట్విట్టర్ లో స్పందించారు. బేర్ గ్రిల్స్ తో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భాగంగా అడవుల్లో సంచరించడం అద్భుతమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రజనీ డిస్కవరీ చానల్ కు కూడా ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో బేర్ గ్రిల్స్, రజనీకాంత్ కర్ణాటకలోని బండిపుర అడవుల్లో సాహసాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమం త్వరలోనే డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది.