హాజరు మినహాయింపు దక్కలేదని కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?: సీఎం జగన్ పై లోకేశ్ వ్యంగ్యం
- సీఎం జగన్ పై లోకేశ్ వ్యాఖ్యలు
- తీవ్ర ఆర్థిక నేరగాడు అంటూ విమర్శలు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ మండిపాటు
కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లడం సాధారణమైన విషయమని, బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్ ఎందుకు వణికిపోతున్నాడని ప్రశ్నించారు. మండలిని రద్దు చేసి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్నది ప్రజలు కోరుకున్నది కాదని, తన స్వార్థ నిర్ణయం అని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడని లోకేశ్ ఆరోపించారు. "తుగ్లక్ నిర్ణయాలకు అడ్డువస్తే శాసన వ్యవస్థలను కూడా శాసిస్తామని జగన్ అంటున్నారు. మండలిని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.