జగన్ స్వార్థం కోసం ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడ్డారు: నారా లోకేశ్

  • ‘లులూ’ లాంటి ఎన్నో సంస్థలను రానీయకుండా చేశారు
  • ఆ సంస్థకు కర్ణాటక ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది
  • మన యువతకు రావాల్సిన ఉద్యోగాలు కర్ణాటకకు వెళ్లిపోయాయి
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు మండిపడ్డారు. జగన్ తన స్వార్థం కోసం ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ‘లులూ’ లాంటి ఎన్నో సంస్థలను రానీయకుండా చేశారని, అదే సంస్థకు మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని అన్నారు. మన యువతకు రావాల్సిన ఉద్యోగాలు కర్ణాటక యువతకు వెళ్లిపోయాయంటూ జగన్ పై విమర్శలు చేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
YSRCP
Jagan

More Telugu News