థాకరేల కుటుంబం నుంచి మరో నాయకుడు.. రూపు మార్చుకున్న ఎంఎన్ఎస్ జెండా
- రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే
- బాల్ థాకరే జయంతి సందర్భంగా ఎంఎన్ఎస్ మహా సభ
- పూర్తిగా కాషాయం రంగులోకి మారిన ఎంఎన్ఎస్ జెండా
తాజాగా థాకరేల కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన మరెవరో కాదు. రాజ్ థాకరే కుమారుడు అమిత్ థాకరే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జయంతిని పురస్కరించుకుని నేడు ఎంఎన్ఎస్ పార్టీ మహా సభను నిర్వహించింది.
ఈ సందర్భంగా అమిత్ థాకరేను అధికారికంగా పార్టీలోకి తీసుకున్నారు. 2006లో ఎంఎన్ఎస్ ను రాజ్ థాకరే స్థాపించారు. ఆ తర్వాత దాదాపు 14 ఏళ్ల అనంతం పార్టీ మహాసభను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కొత్త జెండాను కూడా ఆవిష్కరించారు. ఇప్పటి వరకు కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న జెండా... ఇప్పుడు పూర్తిగా కాషాయ రంగులోకి మారింది. జెండా మధ్యలో శివాజీ కాలంనాటి శివాజీ రాజముద్రను ఉంచారు.
ఎంఎన్ఎస్ కొత్త జెండా