రోజా ఓ సారి కళ్ల పరీక్ష చేయించుకోవాలి: పంచుమర్తి అనురాధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజా ఓ సారి కళ్ల పరీక్ష చేయించుకోవాలి: పంచుమర్తి అనురాధ

  • అమరావతిలో టీడీపీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?
  • ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు 
  • ఏడు నెలల్లో ఏపీలో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కనిపించడం లేదా? అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నిలదీశారు. రోజా ఓ సారి కళ్ల పరీక్ష చేయించుకోవాలని ఆమె ఎద్దేవా చేశారు. ఈ రోజు అమరావతిలో పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ... ప్యాకేజీల కోసమే తమ టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు చేశారని చెప్పారు.

ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అత్యాచారాల సంఖ్య రోజాకు తెలుసా? అని ఆమె నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ వేసిన కమిటీలకు చట్టబద్ధత లేదని ఆమె విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు ఎన్నో అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్నారని, అటువంటి వారికి టీడీపీపై ఆరోపణలు చేస్తూ మాట్లాడే అర్హత లేదని ఆమె చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు విద్వేషాలు రగిల్చారని ఆమె విమర్శలు గుప్పించారు.
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News