త్రివిక్రమ్ ఖాతాలో కొత్త ఓవర్సీస్ రికార్డు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ ఖాతాలో కొత్త ఓవర్సీస్ రికార్డు!

  • రీసెంట్ గా హిట్ కొట్టిన త్రివిక్రమ్ 
  • ఓవర్సీస్ లోను ఆయన సినిమాలకి క్రేజ్ 
  • కొత్త రికార్డును తెచ్చిపెట్టిన 'అల వైకుంఠపురములో'
త్రివిక్రమ్ కథలు సిద్ధం చేసుకునే విధానమే కొత్తగా ఉంటుంది. ముందుగా ఒక లైన్ అనుకుని .. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే అంశాలను మేళవిస్తూ వెళతాడు. వినోదాన్ని పండించే ఏ అవకాశాన్ని వదులుకోకుండా కథను పరుగులు తీయించి, చివరికి ఎమోషన్ కి కనెక్ట్ చేస్తాడు. అందువల్లనే ఆయన సినిమాలు దాదాపు విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కూడా అదే విషయాన్ని నిరూపించింది.

త్రివిక్రమ్ కి మరో భారీ విజయాన్ని అందించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోను త్రివిక్రమ్ సినిమాలకి మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ వుంది. తాజా చిత్రమైన 'అల వైకుంఠపురములో' సినిమా అక్కడ 2 మిలియన్ మార్క్ వసూళ్లను దాటేసింది. గతంలో త్రివిక్రమ్ చేసిన 'అజ్ఞాతవాసి' .. 'అ ఆ'.. 'అరవింద సమేత' సినిమాలు కూడా ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరిపోయాయి. వరుసగా నాలుగు సినిమాలతో 2 మిలియన్ మార్క్ ను సాధించిన అరుదైన రికార్డు త్రివిక్రమ్ ఖాతాలోకి చేరిపోవడం విశేషం.
Trivikram

More Telugu News