నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి!
- క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న ముఖేశ్ సింగ్
- ఎక్కువ సమయం తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించిన రాష్ట్రపతి
- షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22న అమలుకానున్న ఉరిశిక్ష
క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించడంతో నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాబోతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 22న ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. అయితే, క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, 22న ఉరిశిక్ష అమలవుతుందా? లేక మరి కొన్ని రోజులు పడుతుందా? అనేది వేచి చూడాలి.