నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని తన చీరతో కాపాడిన మహిళ!
- గుంటూరు జిల్లా ఈపూరు సమీపంలో ఘటన
- అద్దంకి బ్రాంచ్ కాలువలో పడ్డ బైక్
- ఇద్దరిని కాపాడిన వ్యక్తి, మహిళ
వారి అరుపులు విని పక్కనే ఉన్న పొలంలో పని చేసుకుంటున్న చేకూరి వెంకటనర్సయ్య తొలుత అక్కడికి వచ్చాడు. తన లుంగీతో వారిని కాపాడాలని చూడగా, అది వారి చేతులకు అందడం లేదు. ఈలోగా మిర్చి కోతల నిమిత్తం ఆటోలో వెళుతున్న ఓ మహిళా కూలీ, తన ఒంటిపై ఉన్న చీరను తీసి ఇచ్చింది. చీర సాయంతో వారిద్దరూ తమ ప్రాణాలను కాపాడుకోగా, అనంతరం స్థానికులు నీటిలో పడిన బైక్ ను వెలికితీశారు. రెండు ప్రాణాలు కాపాడేందుకు రైతు, మహిళా కూలీ చూపిన సమయస్ఫూర్తిని పలువురు అభినందించారు.