'అల వైకుంఠపురములో...' సినిమాలో చూపించిన 'ఇంటి' గుట్టు ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'అల వైకుంఠపురములో...' సినిమాలో చూపించిన 'ఇంటి' గుట్టు ఇదే!

  • నిజమైన ఇంటిలో షూటింగ్ చేసిన త్రివిక్రమ్
  • న్యూస్ చానెల్ అధినేత కుమార్తె ఇంటిని చూసి ముచ్చటపడ్డ దర్శకుడు
  • ఆ ఇంటి విశేషాలను అడిగి తెలుసుకున్న బన్నీ
"అదీ వైకుంఠపురమురా..." తన కొడుకు కాని కొడుకును అక్కడికి వెళ్లనివ్వకుండా చూసేందుకు ఓ తండ్రి చెప్పే డైలాగ్ ఇది. అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో..' ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో వైకుంఠపురంగా చూపించిన ఇంటి గురించిన ఆసక్తికర విషయం ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

తన గత సినిమా 'అజ్ఞాతవాసి'లో హీరో ఇంటి కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో లగ్జరీ హౌస్ సెట్ ను వేయించిన త్రివిక్రమ్, 'అల వైకుంఠపురములో..' కోసం ఓ నిజమైన ఇంటిని ఎంచుకున్నారు. ఈ ఇల్లు ఓ టీవీ వార్తా చానెల్ అధినేత కుమార్తె ఇల్లు. హైదరాబాద్ లోని ఆ ఇంటిని చూసిన త్రివిక్రమ్, తన కథకు, కథలోని వాతావరణానికి ఈ ఇల్లు సరిగ్గా సరిపోతుందని భావించి, వారిని సంప్రదించారు. ఇంటి యజమానులు సైతం షూటింగ్ కు అంగీకరించడంతో, దాదాపు 20 రోజుల షూటింగ్ అదే ఇంట్లో జరిగింది.

ఇక ఈ ఇంటిని, దాన్ని నిర్మించిన తీరును చూసి అల్లు అర్జున్ కూడా ముచ్చట పడిపోయాడట. త్వరలో బంజారాహిల్స్ లో తాను సొంత ఇంటిని నిర్మించుకోవాలని భావిస్తున్న బన్నీ, వైకుంఠపురం హౌస్ కు సంబంధించిన విషయాలను ఇంటివారిని అడిగి తెలుసుకున్నాడట.
Ala Vaikunthapuramulo
Trivikram Srinivas
Allu Arjun

More Telugu News