విదేశీయులకు హిందీ పాఠాలు... అమెరికాలో భారత ఎంబసీ వినూత్న కార్యక్రమం
- ఉచితంగా హిందీ క్లాసులు
- భారత సాంస్కృతిక ప్రతినిధి మోక్షరాజ్ హిందీ బోధన
- జనవరి 16 నుంచి భారత ఎంబసీలో క్లాసులు
ఈ విషయాన్ని గమనించిన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేకంగా హిందీ తరగతులు నిర్వహిస్తోంది. భారత ఎంబసీలో సాంస్కృతిక విభాగం ప్రతినిధి మోక్షరాజ్ ప్రత్యేకంగా హిందీ బోధించనున్నారు. జనవరి 16 నుంచి వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో క్లాసులు ప్రారంభం కానున్నాయి. హిందీ బోధనకు అమెరికన్లు, ఇతర విదేశీయులు ఎలాంటి రుసుము చెల్లించనవసరంలేదు. ఇది పూర్తిగా ఉచితం.