పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణశిక్షను రద్దు చేసిన హైకోర్టు

  • 2013లో ముషారఫ్ పై దేశ ద్రోహం కేసు నమోదు
  • గత డిసెంబర్ 17న మరణశిక్ష విధించిన ప్రత్యేక న్యాయస్థానం
  • ఈ తీర్పును కొట్టేసిన లాహోర్ హైకోర్టు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తున్నట్టు ఆ దేశ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ముషారఫ్ కు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్టు కొట్టేసింది. ముషారఫ్ పై దేశద్రోహం కేసు నమోదు చేసేందుకు వీలులేదని, చట్ట ప్రకారం ఆ నిబంధనలు లేవని ముగ్గురు సభ్యులతో కూడిన బెంచ్ పేర్కొందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అసలు ప్రత్యేక కోర్టు ఏర్పాటే చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించిందని, ఈ ఆదేశాల మేరకు ముష్రారఫ్ కు మరణశిక్ష రద్దయిందని చెప్పారు. కాగా, 2013 డిసెంబరులో ముషారఫ్ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. గత ఏడాది డిసెంబర్ 17న  ముషారఫ్ కు మరణశిక్ష విధించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
Go Back to Shorts
Mushraf
Ex-president
High Court
Verdict

More Telugu News