సీబీఐ జేడీ నియామకం అంశం.. విజయసాయిరెడ్డి లేఖకు అమిత్ షా స్పందన!
- హైదరాబాద్ లో సీబీఐ జేడీ నియామకం అంశంపై గతంలో లేఖ
- విజయసాయి వినతిపై తగు చర్యలు తీసుకోవాలి
- కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు అమిత్ షా ఆదేశాలు
కాగా, గత ఏడాది డిసెంబర్ 30న ఈ విషయమై విజయసాయిరెడ్డి లేఖ రాశారు. గతంలో సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, జగన్ కు ఇబ్బందులు సృష్టించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ ద్వారా అప్పటి జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసేవారని ఆ లేఖలో ఆరోపించారు.
