వరల్డ్ కప్ కోసం సరికొత్త అస్త్రంపై కన్నేసిన టీమిండియా!
- కోహ్లీ దృష్టిలో పడిన కర్ణాటక యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ
- దేశవాళీ పోటీల్లో రాణిస్తున్న ప్రసిద్ధ్
- భీకరమైన పేస్ తో వికెట్లు రాబట్టే బౌలర్ గా గుర్తింపు
దేశవాళీ క్రికెట్ లో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ కర్ణాటక యువకిశోరం సాధారణమైన భారత పిచ్ లపై అమోఘమైన పేస్ ను రాబడుతున్నాడు. 23 ఏళ్ల ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ కు సహకరించే ఆసీస్ పిచ్ లపై ప్రసిద్ధ్ ను ప్రయోగించాలని కోహ్లీ భావిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లీ నమ్మకం చూరగొనడంతో ప్రసిద్ధ్ కృష్ణ వరల్డ్ కప్ టీమ్ లో ఎంపికవడం లాంఛనమేననిపిస్తోంది. అయితే, జట్టులో అలవాటు పడేందుకు వరల్డ్ కప్ ముందు ఒకటి, రెండు సిరీస్ లలో ఈ ఆరడుగుల బౌలర్ ను పరిశీలించే అవకాశాలున్నాయి.