ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్ స్పందన
- ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది
- జరిగిన నష్టంపై సమీక్ష జరుగుతోంది
- ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ వ్యవస్థ మాది
మరోవైపు, ఇరాన్ చేసిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైట్ గా తీసుకున్నారు. ఇరాన్ దాడుల అనంతరం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, సింపుల్ గా... 'ఆల్ ఈజ్ వెల్' అని కామెంట్ చేశారు.
ఇరాక్ లోని తమ రెండు మిలిటరీ బేస్ లపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ట్రంప్ తెలిపారు. ప్రాణనష్టంతో పాటు, స్థావరాలకు జరిగిన డ్యామేజీలపై సమీక్ష జరుగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని అన్నారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా తమకు అత్యంత శక్తిమంతమైన, అత్యాధునిక మిలిటరీ వ్యవస్థ ఉందని చెప్పారు. రేపు ఉదయం పూర్తి స్థాయిలో ప్రకటన చేస్తానని తెలిపారు.
మరోవైపు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ... రానున్న రోజుల్లో ఇరాన్ పై తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులను అమెరికా చేయవచ్చని, విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.