రాజధాని హైపవర్ కమిటీకి లేఖ రాసిన రాయలసీమ నేతలు
- లేఖపై సంతకాలు చేసిన గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్
- రాజధానిపై కమిటీల సిఫార్సులు సీఎం ఆలోచనకు తగ్గట్లే ఉన్నాయి
- మా ప్రాంత వాసులు తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశారు
- గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలి
రాయలసీమ ప్రాంత వాసులు తెలుగు జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశారని రాయలసీమ నేతలు లేఖలో తెలిపారు. తమ త్యాగాలు, మనోభావాలు జీఎన్ రావు, బోస్టన్ కమిటీ ప్రతినిధులకు తెలియవని వారు అన్నారు. గ్రేటర్ రాయలసీమలో రాజధానిని పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు.