నిన్ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది బావా: ద్రోణవల్లి హారిక

  • గత నెలలో విడుదలైన 'వెంకీ మామ'
  • కలెక్షన్లపై చిత్ర యూనిట్ ట్వీట్
  • సినిమాకు దర్శకత్వం వహించిన బాబీ
  • సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న హారిక
దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబీ)కు ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక అభినందనలు తెలిపింది. బాబీ దర్శకత్వం వహించిన 'వెంకీ మామ' గత నెలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌ లో అత్యధిక గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన సినిమాగానూ నిలిచింది.

దీనిపై చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేయగా, దీనిపై గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక స్పందించింది. "సో ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ" అని ట్వీట్‌ చేసింది. హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. హారిక ట్వీట్‌ పై బాబీ స్పందిస్తూ, ధన్యవాదాలు తెలిపాడు. ఈ బావా మరదళ్ల ట్వీట్ లకూ నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.
Go Back to Shorts
Dronavalli
Harika
Twitter
Venky Mama

More Telugu News