అమిత్ షా ఇంటి నుంచి మాట్లాడుతున్నామంటూ మంత్రికి ఫోన్.. రూ.3 కోట్లు డిమాండ్!
- పార్టీకి విరాళం ఇవ్వాలంటూ పదేపదే ఫోన్ కాల్
- అనుమానించిన మంత్రి కార్యాలయం
- ఆట కట్టించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు
ఈ ఫోన్‌కాల్‌ను అనుమానించిన మంత్రి కార్యాలయం వెంటనే అమిత్ షా ప్రత్యేక అధికారిని సంప్రదించింది. విరాళం కోసం తాము ఎవరికీ ఫోన్ చేయలేదని అటునుంచి సమాధానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, హరియాణా భవన్‌కు వచ్చి డబ్బులు తీసుకెళ్లాలంటూ నిందితుడికి సూచించారు. నమ్మి వచ్చిన నిందితుడు, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని హరియాణకే చెందిన తోలు జాకెట్ల వ్యాపారి జగ్తార్ సింగ్‌గా, అతడికి సహకరించిన వ్యక్తిని ఉపకార్సింగ్గా పోలీసులు గుర్తించారు.