హిట్ చిత్రాల దర్శకుడికి ఓకే చెప్పిన కార్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిట్ చిత్రాల దర్శకుడికి ఓకే చెప్పిన కార్తి

  • రెండు హిట్లు కొట్టిన కార్తి
  • విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మిత్రన్ 
  • ఇద్దరి కాంబినేషన్లో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ప్రస్తుతం కార్తి టైమ్ బాగుంది .. అందువల్లనే ఆయన సినిమాలు వరుసగా విజయాలను అందుకుంటున్నాయి అనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. తమిళంలో ఇటీవల ఆయన చేసిన 'ఖైదీ' .. రీసెంట్ గా వచ్చిన 'దొంగ' చిత్రాలు సక్సెస్ అయ్యాయి. దాంతో ఆయన తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

విశాల్ తో 'అభిమన్యుడు' .. శివకార్తికేయన్ తో 'హీరో' సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు మిత్రన్ కి కార్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నడవనున్నట్టు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో కార్తి నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తయిన తరువాత, మిత్రన్ తో కలిసి కార్తీ సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై అందరిలోను ఆసక్తి వుంది.
Karthi
Mitran

More Telugu News