అనుమానాస్పద స్థితిలో మరణించిన సాహిత్య అకాడమీ అవార్డు విజేత నంజుండన్!
- బెంగళూరు వర్శిటీలో పని చేస్తున్న నంజుండన్
- గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరు
- చూసేందుకు అసిస్టెంట్ వెళ్లడంతో విషయం వెలుగులోకి
కాగా, బెంగళూరులోని నాగదేవనహల్లిలో ఉన్న నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నంజుండన్ మృతదేహం కనిపించింది. బెంగళూరు వర్శిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్ గా పని చేస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరు కాగా, ఓ అసిస్టెంట్ చూసేందుకు రాగా, విషయం బయటపడింది. దాదాపు 12 పుస్తకాలను కన్నడ నుంచి తమిళంలోకి అనువదించిన ఆయన, కన్నడ మహిళా రచయితలు రాసిన కథలను 'అకా' పేరిట తమిళంలోకి అనువదించినందుకు 2012లో సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.