Andhra Pradesh: సీఎం జగన్ ను కలసి, అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పిన మంత్రులు
- రేపు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు
- జగన్ ని కలిసిన మంత్రుల బృందం
- పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పిన మంత్రులు
రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు జగన్ ను కలసి, ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం జగన్ ని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి అడ్వాన్స్ గా శుభాభినందనలు చెప్పారు.
జగన్ ని కలిసిన మంత్రుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, రేపు జగన్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్న బర్త్ డే సాంగ్స్’ పేరిట వీడియోలు దర్శనమిస్తున్నాయి.