గుంటూరులో మరో దారుణం.. నేపాలీ బాలికపై అత్యాచారం!

19-12-2019 Thu 20:29 | Andhra
  • స్థానిక కొత్తపేటలో ఘటన
  • నాలుగేళ్ల బాలికపై నలభై ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం
  •  బాలిక తండ్రి ఫిర్యాదు.. పోలీసుల అదుపులో నిందితుడు
గుంటూరులో మరో బాలికపై అత్యాచారం జరిగింది. స్థానిక కొత్తపేటలో ఓ నేపాలీ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల నేపాలీ బాలికపై ఇంటిపక్కనే ఉంటున్న నలభై ఏళ్ల వ్యక్తి వేణుగోపాల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉపాధి నిమిత్తం ఆ కుటుంబం నేపాల్ దేశం నుంచి గుంటూరుకు వచ్చింది.

బాలిక తండ్రి నూడిల్స్ పని, తల్లి బయట పనులు చేస్తుంటుంది. వాళ్లిద్దరూ ఇంట్లో లేని సమయంలో చూసి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించినట్టు సమాచారం. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన తండ్రికి తమ కూతురు ఇంట్లో లేకపోవడంతో పక్కింట్లో వెతకగా, వేణుగోపాల్ వద్ద తమ కూతురు ఉండటం గమనించాడు. అనంతరం జరిగిన ఘోరాన్ని గ్రహించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, పదిరోజుల వ్యవధిలో గుంటూరులో ఈ తరహా ఘటనలు మూడు జరిగాయి. స్థానిక రామిరెడ్డి తోటలో ఐదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి, ఆర్.అగ్రహారంలో మూడేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు దారుణాలకు పాల్పడగా, తాజాగా, కొత్తపేటలో ఈ ఘటన జరిగింది.
GunturKothapetMolestationNepali girl

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more