ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

18-12-2019 Wed 21:51 | Telangana
  • అక్రమాస్తుల కేసులో సిద్దిపేట ఏడీసీపీ నరసింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు
  • 20 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోన్న అధికారులు
  • గుర్తించిన అక్రమాస్తుల విలువ రేపు ప్రకటించే అవకాశం
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనిఖీల్లో సిద్దిపేట అదనపు డీసీపీ నరసింహారెడ్డికి చెందిన అక్రమాస్తులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నరసింహారెడ్డి నివాసం, ఆయన బినామీ ఇళ్లలో కూడా అవినీతి నిరోధకశాఖ సోదాలు చేపట్టింది. సోదాలు ఈ రోజు తెల్లవారుఝామువరకు కొనసాగే అవకాశముంది.

ఇప్పటివరకు గుర్తించిన అక్రమాస్తుల విలువను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. రేపు ఈ విషయం వెల్లడించే అవకాశముంది. సిద్ధిపేట, మహబూబ్ నగర్, హైదరాబాద్, షాద్ నగర్, అయ్యవారిపల్లెతో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

నరసింహారెడ్డికి హైదరాబాద్ లో ఓ విల్లా, దాడులు కొనసాగిస్తున్న ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, బ్యాంకు లాకర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. 1996 బ్యాచ్ కు చెందిన నరసింహారెడ్డి పదోన్నతి పొంది ఇన్ స్పెక్టరయ్యారు. అనంతరం సిద్దిపేటలో  ఏసీపీగా పనిచేశారు. ప్రస్తుతం సిద్దిపేటలోనే లా అండ్ ఆర్డర్ విభాగం అదనపు డీసీపీగా పనిచేస్తున్నారు.
ACB raids on siddipeta ADCP Narasimha ReddyTelanganaDisporportion Assest case

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more