విశాఖ వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ హ్యాట్రిక్!

18-12-2019 Wed 20:48 | Sports
  • 33వ ఓవర్లో వరుసగా ముగ్గురిని ఔట్ చేసిన కుల్దీప్
  • కెరియర్లో రెండో హ్యాట్రిక్ సాధించిన స్పిన్నర్
  • తొలిసారిగా ఆసీస్ పై హ్యాట్రిక్ సాధించిన కుల్దీప్
విశాఖ వేదికగా ఉత్కంఠగా వెస్టిండీస్ తో సాగుతున్న రెండో వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతం చేశాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించడమే కాక భారత్ విజయం సాధించే అవకాశాలను మెరుగుపర్చాడు. భారత్ నిర్దేశించిన 387 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 33.3 ఓవర్ల వద్ద 210 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుసగా మూడు వికెట్లు పోగొట్టుకుంది.

33వ ఓవర్ వేసిన కుల్దీప్ ఓవర్ నాలుగో బంతికి  భారత బౌలర్లకు పరీక్ష పెడుతున్న షాయ్ హోప్ 78 పరుగులు (85బంతులు, ఫోర్లు-7 సిక్స్ లు-3) ను అవుట్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతిని సిక్సర్ గా మలచబోయిన హోప్ బౌండరీ లైన్ వద్ద కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో హోప్ పెవిలియన్ చేరాడు. మరుసటి బంతికి హోల్డర్ 11 పరుగులు (13బంతులు, ఒక సిక్స్), స్టంప్ అవుట్ చేశాడు. ఓవర్ చివరి బంతికి అల్జారీ జోసెప్ డకౌటయ్యాడు. వన్డేల్లో కుల్దీప్ హ్యాట్రిక్ చేయడం ఇది రెండో సారి.  గతంలో 2017లో ఆస్ట్రేలియాపై కుల్దీప్ తొలిసారిగా హ్యాట్రిక్ సాధించాడు.

 వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు

1987లో చేతన్ శర్మ న్యూజిలాండ్ పై  
1991లో కపిల్ దేవ్ శ్రీలంకపై
2017లో కుల్దీప్ ఆస్ట్రేలియాపై  
2019లో మహ్మద్ షమీ ఆఫ్ఘానిస్తాన్ పై
2019లో కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్ పై
Visakha onday intl.India vs Westindies

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more