తిరుమల కొండపై సిలువ ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తా: లోకేశ్ కు వెల్లంపల్లి సవాల్

17-12-2019 Tue 13:13 | Andhra
  • అన్యమత ప్రచారంపై శాసనమండలిలో వాగ్వాదం
  • కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందన్న లోకేశ్
  • అన్యమత ప్రచారం వెనుక లోకేశ్ హస్తం ఉందన్న వెల్లంపల్లి
తిరుమల కొండపై అన్యమత ప్రచారంపై ఏపీ శాసనమండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ పాలనలో తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. కొండపై సిలువను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సమాధానంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, అన్యమత ప్రచారం వెనుక లోకేశ్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. వాస్తవానికి కొండపై ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని చెప్పారు.

సోషల్ మీడియాలో అన్యమత ప్రచారం చేస్తూ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు లోకేశ్ యత్నిస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని చెప్పారు. వేంకటేశ్వరస్వామితో రాజకీయాలు వద్దని... టీడీపీ ఇప్పటికే నాశనమయిందని, ఆలయాల జోలికి వస్తే మరింత నాశనమవుతారని అన్నారు. తిరుమల కొండపై సిలువ ఉందనేని టీడీపీ సోషల్ మీడియా క్రియేటివిటీ అని దుయ్యబట్టారు.  సిలువ ఉన్నట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని.. నిరూపించలేకపోతే లోకేశ్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై నారా లోకేశ్ మండిపడ్డారు. తాను ప్రచారం చేస్తున్నట్టు నిరూపించాలని... నిరూపించలేని పక్షంలో సభకు వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
TirumalaNara LokeshVellampalliYSRCPTelugudesam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more