వ్యవసాయ క్షేత్రంలోని కొత్త ఇంట్లోకి తాత్కాలిక గృహ ప్రవేశం చేసిన కేసీఆర్!
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఇల్లు
- నైరుతీ భాగంలో నూతన నిర్మాణం
- పాల్గొన్న మంత్రి కేటీఆర్
వాస్తవానికి ప్రస్తుతం మంచి రోజులు లేవని, ఫిబ్రవరిలో మంచి ముహూర్తం చూసి పూర్తి స్థాయి గృహ ప్రవేశం చేయవచ్చని పండితులు చెప్పిన నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఫామ్ హౌస్ కు వస్తే ఇబ్బంది ఉండకుండా చూసుకునేందుకు తాత్కాలికంగా గృహ ప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. ఇక కనీసం రెండు రోజులు ఇంట్లో ఉండాలని పండితులు సూచించడంతో నేడు కూడా ఆయన అక్కడే ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి తారక రామారావు, మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.