మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టిన శ్రుతి హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మళ్లీ తెలుగుపై దృష్టి పెట్టిన శ్రుతి హాసన్

  • బాలీవుడ్ పై దృష్టిపెట్టిన శ్రుతి హాసన్ 
  • రవితేజ సినిమాతో రీ ఎంట్రీ 
  • మరోసారి మహేశ్ తో జోడీ
తెలుగులో నాజూకు కథానాయికగా ఒక రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న శ్రుతి హాసన్, వరుసగా వస్తున్న అవకాశాలు తిరస్కరించేసి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కుదురుకుంటున్న సమయంలోనే  ప్రేమలోపడటం .. కెరియర్ ను నిర్లక్ష్యం చేయడం జరిగాయి. ప్రియుడు హ్యాండ్ ఇచ్చాక శ్రుతి హాసన్ ఈ లోకంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కెరియర్ పై దృష్టిపెట్టింది.

హిందీతో పాటు తెలుగులోను సినిమాలు చేయడానికి శ్రుతి హాసన్ ఉత్సాహాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలోనే రవితేజ - గోపీచంద్ మలినేని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహేశ్ బాబు తదుపరి సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందనేది తాజా సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితం కానుంది. మహేశ్ బాబుతో చేయడానికి చాలామంది హీరోయిన్లు పోటీపడుతుంటే, ఇంత గ్యాప్ తీసుకున్న శ్రుతి హాసన్ కి మరోసారి ఆయన జోడీగా అవకాశం లభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయంగానే చెప్పుకోవాలి.
Sruthi Hassan
Mahesh Babu

More Telugu News